చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్..: రాత్రికి రాత్రి టీడీపీలో చేరిక

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా ఉత్కంఠకు దారితీసింది. స్థానిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో ఉన్న షేక్ కరీమున్.. ఆదివారం రాత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే భర్త యూసుఫ్ అలీతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.

చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ గా పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరికి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి పురపాలక ఛైర్‌పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తోట రాజారమేష్ ఇందులో పాల్గొన్నారు.

Major Setback for YSRCP Chilakaluripet Chairperson Candidate Shaik Karimun Joins TDP Ahead of Polls

టీడీపీ కండువా కప్పుకొన్న అనంతరం భర్త యూసుఫ్ అలీతో కలిసి షేక్ కరిమున్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో చిలకలూరిపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. పట్టణ ప్రగతిలో తాము కూడా భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ వీడినట్లు వివరించారు. టీడీపీ కూటమి తరఫున తాము చురుగ్గా ప్రచారంలో పాల్గొంటామని, జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఏపీ తీరానికి దూసుకొస్తోన్న సూపర్ సైక్లోన్: 140 కి. మీ వేగంతో ప్రచండగాలులు: బాపట్ల- విశాఖ మధ్య
ఏపీ తీరానికి దూసుకొస్తోన్న సూపర్ సైక్లోన్: 140 కి. మీ వేగంతో ప్రచండగాలులు: బాపట్ల- విశాఖ మధ్య

ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో ఏకంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థే సొంత పార్టీని వీడి టీడీపీలో చేరడం వైఎస్ఆర్సీపీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి తుది జాబితా వచ్చిన వెంటనే చోటుచేసుకున్న ఈ పరిణామంతో చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయావకాశాలు మరింత బలోపేతమయ్యాయని భావిస్తున్నారు. ఈ హఠాత్ చేరికతో పల్నాడు జిల్లా స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+