హీరో మహేష్ బాబు ఇష్టమన్న తెలంగాణ టీడీపీ ఎంపీ

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని మల్కాజిగిరి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మల్లా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాలీవుడ్‌లో తన అభిమాన నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లు అని చెప్పారు. రాజకీయాలలోకి రాకముందు పిల్లలతో కలిసి ప్రతి ఆదివారం సినిమాలకు వెళ్లేవాడినని తెలిపారు.

తాను ప్రముఖుల చరిత్ర చదివి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. సైకిల్ పైన తిరుగుతూ హోటళ్లకు పాలు పోశానని చెప్పారు. టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పారు.

Malkajgiri MP says he is fan of Mahesh Babu

మల్లా రెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. తెరాస నుండి మైనంపల్లి హన్మత రావు, లోక్‌సత్తా నుండి జయప్రకాశ్ నారాయణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ నుండి మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణలు పోటీ చేశారు. మల్లారెడ్డి గెలిచారు.

కాగా, మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు బావమరిది కావడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన బావకు అనుకూలంగా మహేష్ బాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో సామాజిక వెబ్‌సైట్లలో ఓసారి స్పందించారు కూడా. ఆయితే ఆయన పార్టీలకు అతీతంగా బావకు మద్దతిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+