అందుకే కేసీఆర్‌ను పొగిడా: టీడీపీ ఎంపీ, బాబును తప్పించేయత్నం: పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన నియోజకవర్గానికి వచ్చినందునే ఆయనను తాను స్వాగతించానని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత మల్లారెడ్డి శనివారం వివరణ ఇచ్చారు.
తాను వ్యక్తిగత అజెండాతో సీఎం కేసీఆర్‌ను పొగడలేదన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తి లేనే లేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
కాగా, రేవంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి సీఎంను పొగడటం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

బాబును తప్పించే ప్రయత్నాలు: పొంగులేటి
రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాదులో అన్నారు. రేవంత్ కేసు విచారణ నత్తనడకన సాగుతోందన్నారు.
ఈ కేసును వేగవంతం చేయాలన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications