కాంగ్రెస్‌కు భారీ షాక్: మల్లాది రాజీనామా, నేడే జగన్‌తో భేటీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి విజయవాడ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు రాజీనామా చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి విజయవాడ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు రాజీనామా చేశారు. ఆయన పంపిన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మంగళవారం ఆమోదం తెలిపారు.
ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు మంగళవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Recommended Video

ఇప్పటికే మల్లాది విష్ణు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ మల్లాది విష్ణు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.












Click it and Unblock the Notifications