చంద్రబాబుతో తెలంగాణ డిప్యూటీ సీఎం- ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ మేరకు శుభలేఖను అందజేశారు. ఆ సమయంలో భట్టి విక్రమార్క వెంట- తెలంగాణ ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. సుమారు అరగంటకు పైగా వీరి మధ్య చర్చలు సాగాయి. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం మార్చి 5వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ దీనికి వేదిక. సూర్య విక్రమాదిత్య, సాక్షి నిశ్చితార్థ వేడుక గత ఏడాది నవంబర్ 26వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ ఏడాది మార్చిలో వివాహాన్ని నిర్ణయించారు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు. వివాహ ముహూర్తం గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క స్వయంగా ఏపీకి వచ్చారు. చంద్రబాబున ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

Mallu Bhatti Vikramarka has met Chandrababu and invited him for his Son Surya Vikramaditya Wedding

తన కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని చంద్రబాబును కోరారు భట్టి విక్రమార్క. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ వివాహానికి పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులను భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిసి వివాహ పత్రికలు అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మలను ఆహ్వానించారు.

నిశ్చితార్థ వేడుకకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. భట్టి విక్రమార్కతో ఉన్న అనుబంధం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అప్పట్లో నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టార్ కమేడీయన్ బ్రహ్మానందం, కాంగ్రెస్ మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ వంటి సినీ ప్రముఖులు దీినికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+