చంద్ర‌బాబు కు మ‌మ‌త చెక్ : కెసిఆర్ తో క‌లుస్తారా: దీదీ కొత్త ఫ్రంట్‌..!

జాతీయ రాజ‌కీయాల్లో టిడిపి అధినేత ప్ర‌య‌త్నాలు మ‌ధ్య‌లోనే ఆగిపోతాయా అనే సందేహం మొద‌లైంది. మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓట‌మితో త‌న ప్ర‌య‌త్నాలు మ‌రింత వేగంగా ముందుకు వెళ్తాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న వేళ‌.. తృణ‌మూల్ అధినేత్ర బాబు అంచ‌నాల‌కు బ్రేక్‌లు వేస్తున్నారు. కాంగ్రెస్ -బిజెపీయేత‌ర కూట‌మి ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ సైతం ఇదే త‌ర‌హా ఆలోచ‌న చేస్తున్న స‌మ‌యం లో మ‌రి..మ‌మ‌త సైతం కెసిఆర్ తో క‌లుస్తారా..లేక విడిగా ముందెళ్తారా అనే చ‌ర్చ మొద‌లైంది..

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

చంద్ర‌బాబుకు మ‌మ‌తా షాక్‌..!

చంద్ర‌బాబుకు మ‌మ‌తా షాక్‌..!

దేశంలో కాంగ్రెస్ బ‌లం పెరుగుతుంద‌ని..కాంగ్రెస్ తో క‌లిసి ముంద‌కెళ్తేనే బిజెపిని ఓడించ‌గ‌లం అనే టిడిపి అధినేత చంద్ర‌బాబు అంచ‌నాల‌కు తృణ‌మూల్ అధినేత్రి బ్రేక్‌లు వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ లో చంద్ర‌బాబు చొర‌వ తో బిజెపీయేత‌ర పార్టీల స‌మావేశానికి మ‌మ‌త హాజ‌ర‌య్యారు. అయితే, ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజ‌యం త‌రువాత మ‌మ‌త త‌న ఆలోచ‌న‌లు మార్చుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్‌- బిజెపీయేత‌ర పార్టీల ఫ్రంట్ కు మ‌మ‌త ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ సైతం ఇటువంటి ప్ర‌తిపాద‌న‌ల‌తో ముందుకు వెళ్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో..మ‌మ‌తా ఈ కూటమిని ఆమె కేసీఆర్‌తో కలిసి ఏర్పాటు చేస్తారా? లేక టీఆర్‌ఎస్‌ లేకుండా విడిగానా అనేది తేలాల్సి ఉంది. అయితే, ఇది పక్కా ప్రాంతీయ పార్టీల కూటమిగా ఉంటుందని.. టీఆర్‌ఎస్‌, బీజేడీ, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ వంటి పార్టీలు ఇందులో చేరుతాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మ‌మ‌తా తాజా ప్ర‌తిపాద‌న‌ల‌తో చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాల‌కు మ‌మ‌తా షాక్ ఇచ్చినట్లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కెసిఆర్ తో క‌లిసి ముందుకా..

కెసిఆర్ తో క‌లిసి ముందుకా..

బిజెపి కూట‌మి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబుకు కాంగ్రెస్ తో జ‌త క‌ట్టారు. బిజెపిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించేందుకు జాతీయ స్థాయిలో బిజెపీయ‌త‌ర పార్ట‌టీల‌ను ఏకం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. అందులో బాగంగా.. కొద్ది రోజుల క్రితం తృణ‌మూల్ అధినేత్ర మ‌మ‌త ను సైతం క‌లిసారు. మ‌ద్ద‌తు కోరారు. మ‌మ‌తా సూచ‌న మేర‌కు ఢిల్లీలో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఇదే స‌మ‌యంలో కెసిఆర్ తెలంగాణ ఎన్నిక‌ల ప‌లితాల త‌రువాత తాను ఇక జాతీయ రాజీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ - బిజెపీయ‌త పార్టీల‌తో క‌లిసి ముందుకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేసారు. తాజాగా, మ‌మ‌తా అలోచ‌న అదే కావ‌టంతో ఇప్పుడు కెసిఆర్ మ‌మ‌త తో క‌లుస్తారా..మ‌మ‌త సైతం కెసిఆర్ తో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్దంగా ఉన్నారా అనే చ‌ర్చ మొద‌లైంది. గ‌తంలో కెసిఆర్ సైతం మ‌మ‌త ను క‌లిసి మ‌ద్ద‌తు కోరారు. నాడు కెసిఆర్‌..తాజాగా చంద్ర‌బాబు కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన మ‌మ‌తా..ఇప్పుడు తానే కొత్త‌గా ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా అడుగులు వేయ‌టం ప్ర‌ధానంగా చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారే అవ‌కాశం కనిపిస్తోంది .

ఎవ‌రికి న‌ష్టం..ఎవ‌రికి లాభం..!

ఎవ‌రికి న‌ష్టం..ఎవ‌రికి లాభం..!

2019 ఎన్నికల్లో మోదీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పట్నుంచోనే పిలుపునిస్తోంది. ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం ఇదే వాద‌న‌తో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ వంటి పలు ప్రాంతీయ పార్టీలు అంత సుముఖం గా లేవు. మూడు రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి మమతా బెనర్జీ అభినందనలు తెలపకపోవడం.. ఆ మూడు రాష్ట్రాల్లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రె్‌సతో కలిసి కాకుండా విడిగా పోటీచేయడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మమత ప్రతిపాదన ఫలిస్తే.. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ 2019 ప్రణాళికలకు గండిపడు తుంది.ఎన్నికల్లో కూటమే గనుక మెజారిటీ సీట్లు సాధిస్తే జాతీయ పార్టీలతో బేరం ఆడటం, ఒక ప్రాంతీయ పార్టీ నేతనే ప్రధానిని చేయడం సాధ్యమవుతుందని మమత బలంగా నమ్ముతున్న‌ట్లు దీదీ వేస్తున్న అడుగులు స్ప‌స్టం చేస్తున్నా యి. మ‌మ‌తా త‌న ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం ఇస్తే..ముందుగా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌కు బ్రేక్‌లు ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రి, తృణ‌మూల్, ఎస్పీ, బిఎస్పీ వంటి పార్టీలు లేకుండా బిజెపీత‌ర పార్టీల ఫ్రంట్ త‌న లక్ష్యం చేరుకోగ‌ల‌దా అంటే..అది అంత సులువ కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+