అశ్లీల చిత్రాల్లో నటించిన యువకుడి అరెస్ట్, బ్లూఫిలిం వీడియోలను...
శ్రీకాకుళం: ఆముదాలవలసలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ ముఠా శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి ప్రధాన సూత్రదారుడు మహేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పైన వచ్చిన ఆరోపణల పైన దర్యాఫ్తు చేపట్టారు.
అశ్లీల చిత్రాల చిత్రీకరణకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయని పోలీసులు తెలిపారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు చేశామని చెప్పారు.
కొత్తకోటవారి వీధికి చెందిన మహేష్ యువకుడు తానే స్వయంగా అశ్లీల చిత్రంలో ఉంటూ చిత్రీకరించిన వీడియో ఆధారంగా దర్యాఫ్తు చేశామన్నారు. ఈ క్రమంలో మహేష్ స్నేహితులైన ఆముదాలవలసకు చెందిన రమేష్, సంతోష్, వెంకటరావులను మూడ్రోజుల కిందట అరెస్టు చేశామన్నారు.

దర్యాఫ్తులో భాగంగా హార్డ్ డిస్క్, మూడు సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో అశ్లీల చిత్రాలు, మరిన్ని ఇతర చిత్రాలు లభ్యమయ్యాయన్నారు.
అశ్లీల చిత్రాల్లో ప్రధాన సూత్రధారి మహేష్ తో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న సమయంలో ఆ చిత్రాలను చేజిక్కించుకున్న రమేష్, సంతోష్‌లు వాటిని పట్టణంలో చాలామంది వ్యక్తుల మొబైల్స్‌కు, కంప్యూటర్లకు పంపిస్తూ ప్రచారం చేసినట్లు వారే స్వయంగా అంగీకరించారని పోలీసులు తెలిపారు. కృష్ణా రావు అనే వ్యక్తి ఈ చిత్రాలను ప్రసారం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
మహేష్ ఉచ్చులో ఉన్న వారు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని పోలీసులు తెలిపారు. అతడి వద్ద ఉన్న వీడియోలు బయటకు రాకుండా చూసే బాధ్యత తమదేనని పోలీసులు చెప్పారు. సెల్ ఫోన్ దుకాణాల్లో, కంప్యూటర్ సెంటర్లలో, యువకుల సెల్ ఫోన్లలో అటువంటి అశ్లీల చిత్రాలు బయటపడితే వారిపై చర్యలు తప్పవన్నారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications