ప్రేమించలేదని కత్తితో దాడి: ఆత్మహత్యకు యత్నం

ఘటన నుంచి వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని, కాలిపోతున్న ఆమె బావను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసభ్య ప్రవర్తన: టీచర్‌కు దేహశుద్ధి
శ్రీకాకుళం: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తప్పుడు పనులు చేసి ఆ విద్యార్థుల చేతిలోనే తన్నులు తిన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. గత కొంత కాలంగా డ్రాయింగ్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో తామే రంగంలోకి దిగాల్సి వచ్చిందని విద్యార్థినులు తెలిపారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా టీచర్లను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఇద్దరు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications