కన్నకూతురిపై రేప్ యత్నం: యువతికి వేధింపులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాటిగడ్డకు చెందిన ఓ వ్యక్తికి, భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం ఉదయం ఆమె విధులకు వెళ్లగా.. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. కాగా, పెద్ద కుమార్తె (7)ను అత్యాచారం చేసేందుకు తండ్రి పలుమార్లు యత్నించాడు.
దీంతో భయాందోళనకు గురైన బాలిక అరుపులు పెట్టడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. ఆలోపే నిందితుడు పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి బాలిక విషయం చెప్పింది. ఆగ్రహానికి గురైన బాలిక తల్లి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో తనతో స్నేహం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై ఓ యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్యామ్‌లాల్ బల్డింగ్‌లో ఉంటున్న ఓ యువతికి పంజాగుట్టలోని ఎలక్ట్రానిక్ షోరూంలో పని చేస్తున్న ఉపేందర్ గౌడ్(30)తో సంవత్సరం క్రితం పరిచయమైంది. అప్పటి నుంచి వీరిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఉపేందర్ గౌడ్ యువతిని శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications