వివాహేతర సంబంధం: తమ్ముడితోనే బావను చంపించిన అక్క!..

Subscribe to Oneindia Telugu

సత్తెనపల్లి: వివాహేతర సంబంధాలు భార్యాభర్తల హత్యలకు దారితీస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. తాజాగా గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. మిస్టరీగా మారిన ఈ హత్య కేసులో.. భార్య వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని పోలీసులు నిర్దారించారు. సొంత బావమరిదే స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని హతమార్చినట్టుగా గుర్తించారు.

ఏం జరిగింది:

ఏం జరిగింది:

గత నెల 31వ తేదీన సత్తెనపల్లి మండలం పణిదం సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాం బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలేనికి చెందిన పగడాల బుజ్జిబాబు అనే వ్యక్తిదిగా నిర్దారించారు. మిస్టరీ కేసుగా నమోదైన ఈ హత్యకు సంబంధించి పలు విస్తుపోయే విషయాలు తాజాగా వెలుగుచూశాయి.

 వివాహేతర సంబంధం వల్లే..:

వివాహేతర సంబంధం వల్లే..:

భార్య ఆదిలక్ష్మితో కలిసి పగడాల బుజ్జిబాబు గంగిరెడ్డిపాలెంలో నివసిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆకుల నాగేశ్వరరావుతో బుజ్జిబాబు భార్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న బుజ్జిబాబును అడ్డు తొలగించుకోవాలని భార్య ఆదిలక్ష్మి నాగేశ్వరరావుతో కలిసి ప్లాన్ వేసింది.

 సొంత బావమరిదే..:

సొంత బావమరిదే..:

ఆదిలక్ష్మితో కలిసి వేసిన ప్లాన్ మేరకు నాగేశ్వరరావు ఆమె తమ్ముడు జాలె సుబ్బారావును సంప్రదించాడు. బుజ్జిబాబును హతమార్చితే గతంలో తన వద్ద తీసుకున్న రూ.3 లక్షల అప్పు మాఫీ చేస్తానని చెప్పాడు. దీంతో బాకీ తీరిపోతుందన్న ఆనందంలో బావను చంపడానికి ఒప్పుకున్నాడు సుబ్బారావు.

 జనవరి 31న..:

జనవరి 31న..:

నాగేశ్వరరావుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జనవరి 31న బుజ్జిబాబును హతమార్చేందుకు ప్లాన్ వేశాడు. ఆరోజు బుజ్జిబాబు గుంటూరులో జరిగిన బంధువు సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. స్నేహితులు మద్దు శ్రీను అలియాస్‌ జంబో, ఉక్కలం రామయ్య అలియాస్‌ బాబులను తీసుకుని సుబ్బారావు కూడా ఆ కార్యక్రమానికి వెళ్లారు.

పంట పొలాల్లో హత్య..:

పంట పొలాల్లో హత్య..:

సంస్మరణ కార్యక్రమం ముగిసిన తర్వాత బావ బుజ్జిబాబును తీసుకుని స్నేహితులతో కలిసి ఆటోలో బయలుదేరాడు సుబ్బారావు. అప్పటికే అంతా ఫూటుగా మద్యం సేవించి ఉన్నారు. ఆటో పణిదం పంట పొలాల వద్దకు రాగానే బండరాయితో బుజ్జిబాబు తలపై కొట్టి హత్య చేశాడు సుబ్బారావు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు.

నిందితుల అరెస్ట్..:

నిందితుల అరెస్ట్..:

దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు హతుని భార్య ఆదిలక్ష్మితోపాటు ఆకుల నాగేశ్వరరావు, జాలె సుబ్బారావు, మద్దు శ్రీను, ఉక్కలం రామయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలక్ష్మి మినహా మిగిలిన నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man arrested in Guntur for killing his sister's husband on Jan 31st night. Shockingly, his sister made this proposal to kill her husband.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి