ఆన్‌లైన్ వ్యాపారం పేర మోసం: వ్యక్తి అరెస్టు

సులువుగా డబ్బులు సంపాదించాలని భావించి ఆన్‌లైన్ మోసాలకు తెర లేపాడు. బడా వ్యాపారులు, కొత్త వ్యాపారానికై అన్వేషిస్తున్న వారి వద్దకు వైద్యనాధన్ ప్రకాశ్ వెళ్లి తమదైన శైలీలలో మాటలతో ఆకట్టుకుంటాడు.
రూ. 2లక్షల పెట్టుబడి ఆన్‌లైన్ వ్యాపారానికి పెడితే ప్రతీ నెలా వేలల్లో సంపాదించవచ్చని నమ్మబలికి నకీలీ డ్యాకుమెంట్ల ద్వారా డబ్బులను తీసుకుని ఉడాయిస్తాడు. దీంతో బాధితులు ఇతని గురించి ఆరా తీసి చివరికి విసుగెత్తి వదిలేస్తున్నారు. దీంతో ఈయన మోసాలు బయటపడలేదు.
ఇటీవల మరొక బాధితుడు ఇతడి చేతిలో మోసపోవడంతో సైబర్ క్రైంను ఆశ్రయించాడు. దాంతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయని సిఐడి అదనపు డిజి కృష్ణప్రసాద్ తెలిపారు.












Click it and Unblock the Notifications