భార్య పిలుస్తోందని మహిళను పిలిచి రేప్, వీడియో తీసి పదేపదే...!
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఘోరం వెలుగు చూసింది. ఇంటికి దగ్గర్లో ఉంటున్న మహిళ పైన కన్నేసిన ఓ వ్యక్తి, ఇంట్లో ఎవరులేని సమయం చూసి, తన భార్య పిలుస్తోందని ఇంటికి పిలిచి, అత్యాచారయత్నం చేశాడు.
వాటిని వీడియో తీసి, తాను పిలిచినప్పుడల్లా రావాలని, లేదంటే సెల్ ఫోన్లోని చిత్రాలను అందరికీ పంపిస్తానని, ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. తన భర్త స్నేహితుడు, తన ఇంటికి దగ్గరగా ఉంటాడు కదా అని భావించి ఆ మహిళ వెళ్లింది.

తీరా అక్కడకు వెళ్లాక లైంగిక దాడికి దిగాడు. కోరిక తీర్చమని బలవంతం చేశాడు. దానిని రహస్యంగా వీడియో తీశాడు. ఇది తెలిసిన ఆ మహిళ పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ సంఘటన రామభద్రపురం ప్రాంతంలో జరిగింది. మహిళ పైన ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి గండిపిల్లి శ్రీనివాస రావు. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది. బాధిత మహిళ భర్త మార్కెట్ కమిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, మహిళ పైన లైంగిక దాడికి పాల్పడిన శ్రీనివాస రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. నిందితుడి పైన పలు సెక్షనల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications