అభినందనలు: హిందూ డ్రైవర్ కావాలన్న కస్టమర్, విజ్ఞప్తిని తిరస్కరించిన ఓలా క్యాబ్స్

హైదరాబాద్: యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులనందిస్తున్న ఓలా క్యాబ్స్‌పై ట్విట్టర్‌లో అభినందనలు వెల్లువెత్తతున్నాయి. కారణం, తనని పికప్ చేసుకునేందుకు హిందూ మతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ మాత్రమే కావాలని ఒక కస్టమర్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడమే.

 Man asks for Hindu driver. Twitter applauds Ola’s firm reply

వివరాల్లోకి వెళితే, ట్విట్టర్ వేదికగా, శీలం వీరప్పనాయుడు అనే కస్టమర్ సోమవారం తనకు క్యాబ్ కావాలని కోరుతూ, హిందూ మతానికి చెందిన డ్రైవర్‌ను పంపాలని కోరాడు. ఇందుకు గాను ఓలా క్యాబ్స్ 'మతం ప్రాతిపదికన మా డ్రైవర్లపై వివక్ష చూపలేము' అంటూ సమాధానం ఇచ్చింది.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో 700 సార్లు రీట్వీట్ అయింది. అంతే కాదు విమానం, బస్సు ఎక్కినప్పుడు కూడా ఇలాగే అడుగుతావా? హోటల్‌కు పోతే వంటవాళ్ల మతాలు తెలుసుకుంటావా? అంటూ వీరప్పనాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో తాను వివక్ష చూపాలని చెప్పడం లేదని, కస్టమర్ ప్రాధాన్యతగా చూడాన్నది తన అభిమతమని, ఎవరినీ బాధించాలని తాను అలా చేయలేదని శీలం వీరప్పనాయుడు సమాధానమిచ్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+