కోడలిపై మామ అత్యాచార యత్నం: దేహశుద్ధి

విజయవాడ: వావివరుసలు మరిచిపోయి ఓ వ్యక్తి తన కోడలినే చెరపట్టాలని ప్రయత్నించాడు. అతను కోడలిపైనే అత్యాచారయత్నం చేసిన ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది.

జిల్లాలోని గూడూరు మండలం తిప్పవరప్పాడులో కోడలిపై మామ అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు ఆ కామాంధుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వచ్చి కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

man attempts to rape daughter-in-law

ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా ఇడుపుల పాయలోని ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇడుపుల పాయలోని ట్రిపుల్‌ ఐటీలో భవనంపై నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

ఇంట్లో భారీ చోరీ

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని బిక్కవోలు మండలం కొంకుదురులో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి ఆరు లక్షల రూపాయల నగదు, 55 తులాల బంగారాన్ని అపహరించారు. పోలీసులు వచ్చి దొంగల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+