లైంగిక దాడికి ప్రయత్నించి ఆమె చెవులు కొరికాడు

Karimnagar
కరీంనగర్: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై దుశ్చర్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులోని రామినేని జిన్నింగ్ మిల్లు వద్ద ఆ సంఘటన చోటు చేసుకుంది. ఆ మహిళపై ఆ మిల్లులో పనిచేసే కార్మికుడు సంజయ్ లైంగిక దాడికి ప్రయత్నించి ఆమె చెవులను, ఇతర శరీర భాగాలను కొరికాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ బుధవారం సాయంత్రం మిల్లు బయట ఇతర కార్మికులతో కలిసి మద్యం సేవించాడు. ఆ సమయంలో ఆకు కూర ఏరుకుని జీవనం సాగిస్తున్న రేణిగుంటకు చెందిన మహిళ ఒకామె మిల్లు పరిసరాల్లోకి వచ్చింది. ఆమెను చూసిన సంజయ్ పక్కకు లాక్కుని వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు.

ఆమె ప్రతిఘటించడంతో ఆమె రెండు చెవులను కొరికాడు. ఆమె శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొరికాడు. ఆమె కేకలు విని అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంఘటనా స్థలానికి వెళ్లాడు. అతన్ని చూసి సంజయ్ పారిపోయాడు.

ఆ వ్యక్తి అతన్ని వెంటపడి పట్టుకున్నాడు. మిల్లు సిబ్బంది అతన్ని సంజయ్‌ని చితకబాదారు. గ్రామ ప్రజలు సంజయ్‌ని గేటుకు కట్టేసి కొట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+