వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యూజియంగా కురుసుర కథ, అభినందన (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నీటి అడుగున పయనించే జలాంతర్గామిని భూమిపై మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన అప్పటి తూర్పు నావికా దళ ఛీప్ రిటైర్డ్ వైస్ అడ్మిరల్ వినోద్ పశ్రిచను వ్యక్తిగత అచీవ్‌మెంట్ అవార్డుతో వరల్డ్ షిప్ ట్రస్ట్ (యూకె) బుధవారం సత్కరించింది.

ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియం ప్రపంచంలోనే ప్రఖ్యాత జలాంతర్గామి మ్యూజియంగా నిలిచింది. విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంను ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా వీక్షిస్తున్నారు. అప్పటి తూర్పు నావికా దళ ఛీప్ వైస్ అడ్మిరల్ వినోద్ పశ్రిచ అధ్యక్షతన దీనిని తీరానికి చేర్చారు. ఆ కృషి ఫలితంగానే నేడు యునైటెడ్ కింగ్ డమ్ లోని వరల్డ్ షిప్ ట్రస్ట్ ద్వారా అవార్డును అందుకున్నారు.

31 ఏళ్ల పాటు భారత నావికా దళానికి సేవలు అందించిన ఐఎన్ఎస్ కురుసుర పూర్వ సోవియట్ యూనియన్ రష్యా ఫాక్స్ ట్రాట్ తరగతికి చెందిన జలాంతర్గామి. 1969 డిసెంబర్‌లో భారత నావికా దళంలోకి చేరి 1971లో జరిగిన యుద్దంలోనూ చురుకైన పాత్రను పోషించింది.

వ్యక్తిగత అవార్డుని అందుకున్న తూర్పు నావికా దళ ఛీప్ వైస్ అడ్మిరల్ వినోద్ పశ్రిచ మాట్లాడుతూ "1998లో ఓ సారి ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ కొనుగోలు కోసం అప్పటి యుఎస్ఎస్ఆర్ వెళ్లాను. ఆ తర్వాత ఆరు నెలలకు భారత్‌కు ఓ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ వచ్చింది. ఐదే ఐఎన్ఎస్ విక్రమాదిత్య. అప్పుడు ఓ మ్యూజియం నా దృష్టిని ఆకర్షించింది. అది జలాంతర్గామి. ఓ పెద్ద జలాంతర్గామిని మ్యూజియంగా ఓ జెట్టీపై ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తూర్పు నావికా దళానికి ఛీఫ్ గా వచ్చాను. ఇక్కడి బేస్ నుండి కురుసుర సేవలందిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకి అది సేవల నుండి వైదోలిగే సమయం ఆసన్నమైంది. "

"1971 యుద్దంలో సేవలందించిన ఐఎన్ఎస్ కురుసురను మ్యూజియంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన నేవీకి వచ్చింది. అప్పటికే ఐఎన్ఎస్ కల్వరి సేవల నుండి విముక్తి పొందింది. దాన్ని ఏడు బాగాలుగా చేసి ఓ భాగాన్ని సాగర తీరంలో ఏర్పాటు చేశారు. సందర్శకులకు పూర్తి అవగాహన కలగాలంటే అది సరిపోదని అనిపించి... కురుసుర ఈఎన్‌సీలోనే సేవలు విరమిస్తుండటంతో ఇక్కడే మ్యూజియంను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ప్రజలు తిరిగే ప్రాంతానికి దగ్గరలో చేయాలనే ఆలోచనతో సాగరతీరంలో ఏర్పాటు చేశాం" అని అన్నారు.

 ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఏర్పాటుకు కృషి చేసినందుకు గాను తూర్పు నావికా దళ ఛీప్ రిటైర్డ్ వైస్ అడ్మిరల్ వినోద్ పశ్రిచను వ్యక్తిగత అచీవ్‌మెంట్ అవార్డుతో వరల్డ్ షిప్ ట్రస్ట్ (యూకె) బుధవారం సత్కరించింది.

 ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

తూర్పు నావికా దళ ఛీప్ రిటైర్డ్ వైస్ అడ్మిరల్ వినోద్ పశ్రిచను వ్యక్తిగత అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరిస్తున్న వరల్డ్ షిప్ ట్రస్ట్ (యూకె).

 ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

31 ఏళ్ల పాటు భారత నావికా దళానికి సేవలు అందించిన ఐఎన్ఎస్ కురుసుర పూర్వ సోవియట్ యూనియన్ రష్యా ఫాక్స్ ట్రాట్ తరగతికి చెందిన జలాంతర్గామి. 1969 డిసెంబర్‌లో భారత నావికా దళంలోకి చేరి 1971లో జరిగిన యుద్దంలోనూ చురుకైన పాత్రను పోషించింది.

 ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

ఐఎన్ఎస్ కురుసుర మ్యూజియంగా ఎలా అయిందంటే..?

1971 యుద్దంలో సేవలందించిన ఐఎన్ఎస్ కురుసురను మ్యూజియంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన నేవీకి వచ్చింది. అప్పటికే ఐఎన్ఎస్ కల్వరి సేవల నుండి విముక్తి పొందింది. దాన్ని ఏడు బాగాలుగా చేసి ఓ భాగాన్ని సాగర తీరంలో ఏర్పాటు చేశారు.

English summary
Recognising the unstinted efforts of Vice Admiral (retd) Vinod Pasricha, who as then Flag Officer Commanding-in-Chief of Eastern Naval Command, saw INS Kursura beached and converted into a museum World Ship Trust of UK honoured him with ‘Individual Achievement Award’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X