Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్త లేనప్పుడు టచ్ లోకి మాజీ?: వేరేవాళ్లతోనూ గడపాలని వేధింపులు, ఇలా వెలుగులోకి..

Recommended Video

    భర్త లేనప్పుడు టచ్ లోకి మాజీ? తర్వాత ఏమయిందో తెలుసా ?

    చిత్తూరు: తాను డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ యువకుడితో ప్రేమలో పడిందో యువతి. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు పెళ్లి కావడంతో అతన్ని దూరం పెట్టింది.

    కాగా, పెళ్లి తర్వాత ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లడంతో పాత ప్రియుడు మళ్లీ టచ్ లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య కొన్నిరోజులు మామూలుగానే మాటలు నడిచాయి. కానీ ఉన్నట్టుండి మాజీ ప్రియుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. గతంలో తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలు, వీడియోలు చూపించి.. మళ్లీ తనతో గడపాలని బెదిరించాడు.

     అసలేంటీ వ్యవహారం?:

    అసలేంటీ వ్యవహారం?:

    చిత్తూరుకు చెందిన ఓ యువతికి ప్రకాష్ అనే యువకుడితో వివాహమైంది. వివాహానంతరం ఉపాధి కోసం ప్రకాష్ దుబాయ్ వెళ్లాడు. ప్రకాష్ దుబాయ్ వెళ్లిన సమయంలో.. యువతితో మాజీ ప్రియుడు పవన్ కుమార్ టచ్ లోకి వచ్చాడు. వీరిద్దరూ డిగ్రీ చదువుతున్న సమయంలో ఒకరికొకరు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లయ్యాక ఆమె అతన్ని దూరం పెట్టేసింది.

    లొంగలేదని.. వాటితో బ్లాక్ మెయిల్:

    లొంగలేదని.. వాటితో బ్లాక్ మెయిల్:

    యువతితో టచ్ లోకి వచ్చిన పవన్ ఆమెతో లైంగిక కోరిక తీర్చుకోవాలని భావించాడు. నయానో.. భయానో.. ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. అతని బ్లాక్ మెయిలింగ్‌కు యువతి లొంగకపోవడంతో.. పాత ఫోటోలు బయటపెడుతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.

    ఒక్కసారి వస్తే..:

    ఒక్కసారి వస్తే..:

    ఒక్కసారి తన వద్దకు వస్తే.. ఇక జీవితంలో నీ జోలికి రానంటూ యువతిని పవన్ బ్లాక్ మెయిల్ చేశాడు. లేదంటే.. తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులకు లొంగిపోయిన యువతి.. అతను చెప్పినట్టే బెంగళూరు వెళ్లింది.

     బెంగళూరు వెళ్లొచ్చాక కూడా..:

    బెంగళూరు వెళ్లొచ్చాక కూడా..:

    బెంగళూరు వెళ్లి పవన్ ను కలిసొచ్చాక కూడా అతని నుంచి వేధింపులు ఆగలేదు. మరో కొంతమంది పేర్లు చెప్పి వారితోనూ గడపాలని పవన్ ఆమెను బెదిరించాడు. సదరు యువతి ఎంతకీ లొంగకపోవడంతో ఈసారి సరాసరి ఆమె ఇంటికే వచ్చాడు.

     ఇలా వెలుగులోకి:

    ఇలా వెలుగులోకి:

    ఇటీవల ఓరోజు ప్రకాష్ ఏదో పని మీద ఇంటి నుంచి బయటకెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. తాను ఇంట్లోకి రావడం చూసి తనను తోసుకుంటూ అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత భార్యను నిలదీస్తే అతని పేరు పవన్ అని, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, జరిగిన విషయమంతా భర్తతో చెప్పింది.

     భర్త సహకారంతో యువతి ఫిర్యాదు:

    భర్త సహకారంతో యువతి ఫిర్యాదు:

    భర్త ప్రకాష్ ఆమెను అర్థం చేసుకోవడంతో ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ప్రకాష్ ఫిర్యాదు మేరకు పవన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతితో గతంలో ఉన్న సంబంధాన్ని ఆసరా చేసుకుని పవన్ బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+