లోదుస్తుల్లో కిలో బంగారంతో పట్టుబడిన వ్యక్తి

జీన్స్ లోపల వేసుకున్న లోదుస్తుల్లో కిలో బంగారాన్ని దాచిపెట్టుకుని అతను విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతన్ని విశాఖపట్నానికి చెందిన సురేష్‌గా గుర్తించారు. గత నెలలో అక్టోబర్ 25వ తేదీన బ్యాంకాక్ నుంచి బంగారం తెచ్చిన హైదరాబాదుకు చెందిన సయ్యద్ జాఫర్ అలీ ఖాన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
జాఫన్ అలీఖాన్ నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారాన్ని రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు. సురేష్ మెటల్ సెన్సార్ గుర్తించకుండా జాగ్రత్త చేసుకుని సురేష్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. బంగారం బిస్కట్ల రూపంలో ఉంది.
కార్బన్ పేపర్లలో చుట్టి బెల్టు బకిల్ పక్కన బెల్టుకు లోపల బంగారాన్ని అతను జాగ్రత్త చేశాడు. మెటల్ సెన్సార్ గుర్తించినా జీన్స్ జిప్పర్ లేదా బెల్టు బకిల్ అని భావించేలా చూసుకున్నాడు.












Click it and Unblock the Notifications