IPL: ప్లే ఆఫ్స్ ఫిక్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ కు షాక్- ఫైనల్ ఇలా..!!

IPL 2026: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈసారి వేదికల విషయంలో బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ సొంత గడ్డపై జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వేదిక మారింది. బెంగళూరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ, ఫైనల్ పోరు అహ్మదాబాద్‌కు మార్పు చేసారు. ప్లే ఆఫ్స్ లో స్థానం కోసం జట్ల మధ్య పోటీ పెరిగింది. ఇక, అహ్మదాబాద్​ వేదికగా మే 31న ఐపీఎల్​ ఫైనల్​ జరగనుంది.

ఐపీఎల్ 2026 లో ఈ సారి ప్లే ఆఫ్స్.. ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసింది. మే 26న ధర్మశాల వేదికగా క్వాలిఫయర్​-1 మ్యాచ్​ జరగనుంది. ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​ టాప్​-2లో ఉన్న జట్లు ఇందులో పోటీపడతాయి. ఇక మే 27న, ఛండీగఢ్​లో ఎలిమినేటర్​ ఉండబోతోంది. టాప్​-3,4 జట్లు తలపడతాయి. ఓడిపోయిన వారు ఎలిమినేట్​ అవుతారు.

IPL playoffs schedule announced Final shifted from Bengaluru as Ahmedabad will host it again here the details

ఇక అదే వెన్యూలో మే 29న క్వాలిఫయర్​-2 మ్యాచ్​ ఉంటుంది. అంటే క్వాలిఫయర్-1 లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్​లో గెలిచిన జట్టుతో తలపడతుంది. ఇక క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 మ్యాచ్​ల్లో గెలిచిన జట్లు అహ్మదాబాద్​ వేదికగా మే 31న ఫైనల్​లో తలపడ నున్నాయి. కాగా.. ఐపీఎల్​ 2025లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు విజేతగా నిలిచింది కాబట్టి, ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్​ జరగాల్సి ఉంది.

అయితే, స్థానిక అసోసియేషన్లు, అధికారుల నుంచి డిమాండ్లు, రిక్వైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయ ని, అవి బీసీసీఐ చేతుల్లో కూడా లేవని, అందుకే ఐపీఎల్​ 2026 ఫైనల్​ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్​ కు మార్పు చేసారు. ఫైనల్​ తరలిపోవడం బెంగళూరులో ఐపీఎల్​ లవర్స్​కి షాక్​ ఇచ్చే విషయమే అని చెప్పుకోవాలి. పైగా డిఫెండింగ్​ ఛాంపియన్​గా బరిలో దిగిన ఆర్సీబీ, ఈసారి కూడా మంచి ఫామ్​లో ఉంది.

ఈ జట్టు ఒకవేళ ఫైనల్ చేరితే బెంగళూరు ఫ్యాన్స్​ మంచి అవకాశాన్ని కోల్పోతారు. ఇక.. పాయింట్ల పట్టికలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చివరకు రన్ రేట్ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ప్లే ఆఫ్స్ జట్లతో పాటుగా.. ఫైనల్ చేరే జట్ల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పుడు అధికారికంగా షెడ్యూల్ రావటంతో... ఐపీఎల్ తదుపరి మ్యాచ్ ల పైన మరింత ఆసక్తి పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+