ఈ హిల్ స్టేషన్ గురించి తెలుసా..? హైదరాబాద్ కు 70 కి. మీ. దూరంలోనే

బిజీ బిజీ లైఫ్.. ట్రాఫిక్ రద్దీలు.. ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవితం బోర్ కొట్టిందా..? అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఉంది. చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా భూతల స్వర్గాన్ని తలపించే వాతావరణం ఇక్కడి ప్రాంతం సొంతం. అవే తెలంగాణలోని అనంతగిరి కొండలు.. హైదరాబాద్ కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే వికారాబాద్ జిల్లాలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. ఈ ప్రాంతం తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ప్రేమికులకు.. వీకెండ్ ట్రిప్స్ కు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది. వికారాబాద్ లోని అనంతగిరి హిల్ స్టేషన్ లో అనేక ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. అలాగే ట్రెక్కింగ్, సాహసాలకు అనంతగిరి హిల్స్ కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాయి.

దట్టమైన అడవి మధ్యలో ట్రెక్కింగ్ చేసేందుకు అనంతగిరి హిల్స్ అనుకూలంగా ఉంటాయి. అడవి మధ్యలో నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ కొండల నుంచే మూసీ నది పుట్టి హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు నీటిని అందిస్తుంది. అనంతగిరి కొండల మొత్తం విస్తీర్ణం దాదాపు 3,763 ఎకరాలుగా ఉంది. వికారాబాద్‌ టౌన్‌ కు ఈ కొండలు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అనంతగిరి ప్రాంతంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక పర్యాటక జోన్​ రూపుదిద్దుకుంది. బర్డ్‌ వాచ్‌ సెంటర్, వ్యూ పాయింట్లు, ట్రెక్కింగ్‌ మార్గాలు, నేచర్‌ వాక్స్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే కట్టుదిట్టమైన భద్రత, పార్కింగ్‌ సౌకర్యాలు, పర్యాటక సమాచార కేంద్రాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పిల్లల కోసం థీమ్‌ పార్కులు, వెల్‌ నెస్‌ సెంటర్​లు, పర్యావరణ అనుకూల రిసార్టులు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

AnanthagiriHills Vikarabad district wonderful tourist destination located just 70 km from Hyderabad

ఇక వికారాబాద్‌ నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే దామగుండం వస్తుంది. ఈ 10 కిలోమీటర్ల దారి ఎత్తు పల్లాలతో కొండ ప్రాంతంలో విహారం నగరవాసులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే అనంతగిరి పర్యాటక ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు వెళ్తే కోటిపల్లి చెరువు అందాలను వీక్షించవచ్చు. ఇక్కడ కాయాకింగ్​, బోటింగ్​ వంటి వాటర్ స్పోర్ట్స్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే మరో పర్యాటక ఆకర్షణగా సర్పన్‌ పల్లి చెరువు ప్రాంతం నిలుస్తోంది. చుట్టూ కొండలతో ప్రశాంతమైన వాతావరణం, నిండి ఉండి పర్యాటకులను సేదతీర్చే మరో అద్భుత పర్యాటక ప్రదేశంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+