అనుమానంతో భర్త పీక కోసి తల వద్ద దీపం పెట్టిన ఇల్లాలు!

ఒకప్పుడు భర్తలు భార్యలను హతమారుస్తున్న ఘటనలు జరిగేవి. ఇటీవల కాలంలో భార్యలే అత్యంత దారుణంగా భర్తలను పరలోకాలకు పంపిస్తున్న సంఘటనలు పెరిగిపోయాయి. అనుమానాలతో కొందరు, అక్రమ సంబంధాలతో కొందరు, ఆస్తి కోసం కొందరు ఇలా రకరకాలుగా దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. సినిమాలలో కూడా చూడని విధంగా క్రిమినల్ వైఫ్స్ కొత్త కొత్త ప్లాన్ లు, స్కెచ్ లతో భర్తలను చంపేస్తున్నారు.

అనుమానంతో భర్తను హతమార్చిన భార్య

తాజాగా అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమారు మూడు దశాబ్దాల దాంపత్య జీవితం అనుమానం కారణంగా విషాదాంతంగా ముగిసింది. అనుమానం పెద్ద భూతంగా మారి భార్యను భర్తను హత్య చేసే స్థాయికి తీసుకెళ్లింది.

wife killed husband In Chodavaram Anganwadi worker Indira killed her husband of suspicion

ప్రేమ వివాహం చేసుకున్న కపుల్

రామ్మోహనరావుపేట సమీప అంబేడ్కర్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్న కొండ్ల ఇందిర, ఆమె భర్త వెంకటరావు (58) లకు నలుగురు కుమార్తెలు. ఒక కూతురికి వివాహం జరిగింది. వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో ఉద్యోగం చేసేవాడు. భార్యా భర్తలు ఇద్దరూ స్థానికులే. వారిది ప్రేమ వివాహం. కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు.

వేరే మహిళతో సంబంధం ఉందని భర్త గొంతు కోసిన ఇందిర

వెంకటరావు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. అనకాపల్లిలో ఉన్న కుమార్తె ఇంటి నుంచి శనివారం తిరిగి వచ్చాక మళ్లీ తీవ్రమైన గొడవ జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దగ్గరకే వెంకటరావు వెళ్లి వచ్చాడని భావించి, ఆ సమయంలో పట్టరాని ఆవేశంతో ఇందిర కత్తి తీసుకుని భర్త గొంతు కోసి హత్య చేసింది. తర్వాత మృతుని తల వద్ద దీపం పెట్టి పోలీసుల ముందు లొంగిపోయింది.

ఏపీలో వారికి తీపికబురు.. ఆగస్టు 20లోగా మీ ఖాతాల్లో రూ.25 వేలు!
ఏపీలో వారికి తీపికబురు.. ఆగస్టు 20లోగా మీ ఖాతాల్లో రూ.25 వేలు!

హత్యకు పాల్పడిన ఇందిర అంగన్వాడీ కార్యకర్త

ఈ సంఘటనలో షాకింగ్ విషయం ఏమిటంటే ఇందిర స్థానికంగా మహిళలకు కుటుంబ సమస్యలపై అవగాహన, ఆరోగ్య అవగాహన కల్పించే అంగన్‌వాడీ కార్యకర్త. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+