ఇక తెలంగాణాలో ఉద్యోగాల జాతరే.. నిరుద్యోగులూ గెట్ రెడీ!
తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, జాబ్ నోటిఫికేషన్లను ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నామమాత్రంగా చేస్తుందని తెలంగాణాలోని నిరుద్యోగ వర్గాలలో ఒకింత అసహనం ఉంది, దీనిని ప్రతిపక్షాలు వాడుకుంటూ నిరుద్యోగుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈక్రమంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు.
ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు
సంగారెడ్డిలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఉద్దేశించి ముఖ్యమైన హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆందోళన వద్దని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడకూడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం పది వేల పోస్టులకు నోటిఫికేషన్లు
గత రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం మరో పది వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ఇంకా వయోపరిమితిని రెండేళ్లు సడలించినట్లు చెప్పారు. యువత పరీక్షలకు సిద్ధం కావాలని, హక్కులు కోల్పోకుండా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ యువత డిమాండ్స్ ఇవే
తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగునా అండగా ఉండే యువతను నిర్లక్ష్యం చేయబోమన్నారు.యువత ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దన్నారు. అయితే నిరుద్యోగ యువత మాత్రం అనేక సందర్భాలలో ఆందోళన బాట పడుతున్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్/ఎస్ఐ పోస్టులు 5,000 నుంచి 19,000-20,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
వరుస నోటిఫికేషన్ లకు రెడీ అవుతున్న టీజీపీఎస్సీ
గ్రూప్-1, 2, 3, 4, డీఎస్సీ నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. వయోపరిమితి సడలింపు కొనసాగించాలి అని చేసిన డిమాండ్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా ప్రతీ ఆరు నెలలకు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పటం యువతకు శుభవార్త. అంతేకాదు వచ్చే వారం నుండి ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లో వరుస నోటిఫికేషన్ లను ఇస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.













Click it and Unblock the Notifications