ప్రేమ పేరుతో దగ్గరై: ఆమెకు ఊహించని షాక్.. ఏకాంత వీడియోలను..
దీపావళి పండుగ నేపథ్యంలో.. షర్మిలారెడ్డిని మానసికంగా ఇబ్బందికి గురిచేసేందుకు తెలిసినవాళ్లే ఈ పని చేసి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాకుళం: ఇంటర్నెట్ సెంటర్ లో మొదలైన ప్రేమ.. వారిద్దరి మధ్య రెండేళ్లుగా కొనసాగుతోంది. ఈ రెండేళ్ల కాలంలో వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో ఆ యువతి అతనే లోకంగా బతికింది. కానీ తీరా పెళ్లి మాటెత్తేసరికి అతను చేసిన నిర్వాకానికి నివ్వెరపోయింది.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలోని రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలగావీధి-సత్యనారాయణపురం వీధికి చెందిన గట్టి కృష్ణ ప్రసన్నకుమార్ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.

పట్టణానికి చెందిన ఓ యువతి ఇంటర్నెట్ సెంటర్ కు తరుచుగా వస్తుండేది. ఈ క్రమంలో ప్రసన్న కుమార్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అలా రెండేళ్లుగా వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని ప్రసన్న కుమార్ ఆమెను నమ్మించాడు. అలా ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో పలు ఫోటోలు, వీడియోలు చిత్రీకరించాడు.
ఇటీవల పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతో ముఖం చాటేస్తూ వస్తున్నాడు. దీనిపై గట్టిగా నిలదీసేసరికి స్నేహితులు, బంధువులు, తెలిసిన వారికి వాట్సాప్‌లో యువతి అశ్లీల వీడియోలను పంపాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలికి అండగా నిలుస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ భరోసా ఇచ్చింది.












Click it and Unblock the Notifications