విషమిచ్చి తండ్రి ఆత్మహత్య, మరోచోట.. భర్త అక్రమ సంబంధం, భార్య ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయవాడలో ఘోరం జరిగింది. భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన ఓ తండ్రి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని కృష్ణలంక రణదివే నగర్‌కు చెందిన యశోద, సురేష్ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు.

కుమారుడు అమర్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిన్న రాత్రి తనయుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సురేష్ తన భార్య ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, ఆ తర్వాత తానూ తిన్నాడు.

వీరిలో కొడుకు అమర్‌తో పాటు భార్య యశోద, భర్త సురేష్ మృతి చెందారు. ఇద్దరు కుమార్తెల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

Man commits suicide after giving poison to family

మరో కేసులో.. అక్రమ సంబంధం, భార్య ఆత్మహత్య

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన తోట విమల కుమారిని కానూరు సనత్ నగర్‌కు చెందిన సురేష్ కుమార్ పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.

సురేష్ తాను పని చేసే కంపెనీలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు సర్ది చెప్పారు. కాగా, శుక్రవారం కాకినాడ నుంచి వచ్చిన భర్త.. భార్యతో ఈ విషయమై గొడవ పడ్డారు. అతను వెళ్లిపోయాక విమల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man commits suicide after giving poison to family in Vijayawada.
Please Wait while comments are loading...