సెల్ఫీ సూసైడ్: ప్రేమించి పెళ్లాడి.. అక్కడికి వెళ్లాక మార్పు, యువకుడితో భార్య అఫైర్
Recommended Video

విజయవాడ/హైదరాబాద్: గురువారెడ్డి సెల్ఫీ సూసైడ్ కేసులో పోలీసులు అతని భార్య గాయత్రి, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడిపై కేసు నమోద చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్తింటి వేధింపులు భరించలేక కృష్ణలంకలో ఓ యువకుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: అమ్మానాన్న క్షమించండి: అత్తింటి వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య, భార్యకు వివాహేతర సంబంధం?
ఆత్మహత్య చేసుకున్నందుకు తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ, తన భార్య, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు తన ఆత్మహత్యకు కారణం అని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియోతో రైలు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపడుతున్నారు.

ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లడంతో ఇంట్లో గొడవలు
ఈ ఆత్మహత్యపై గురువారెడ్డి స్నేహితులు ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. గురువారెడ్డి, ఆమె అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అమ్మాయి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లినప్పటి నుంచే గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. హైదరాబాదులో కార్తీక్ అనే యువకుడితో తిరగడం ప్రారంభించిందని తెలిసిందన్నారు.

అతనితో తిరగనని చెప్పి.. హైదరాబాద్ వస్తే మాట్లాడుకుందాం
హైదరాబాదులో మరో వ్యక్తితో తిరుగుతూ భర్తను వదిలేయాలని నిర్ణయించుకుందని ఆ స్నేహితుడు తెలిపారు. గురువారెడ్డికి తెలిసి అడిగితే స్నేహితుడు అని చెప్పిందని, తాను ఇక అతనితో తిరగనని చెప్పిందని, కానీ ఆ తర్వాత గురువారెడ్డి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేదని, లిఫ్ట్ చేసినా నువ్వు హైదరాబాద్ వస్తే మాట్లాడుకుందని చెప్పేదన్నారు.

స్టేషన్లో ఫిర్యాదు
అమ్మాయి హాస్టల్లో ఉండేదని, హాస్టల్‌కు వెళ్తే అక్కడ కనిపించకపోయేదని, ఆఫీస్‌కు వెళ్తే అక్కడ ఉండేది కాదని, విషయం ఏమని తెలుసుకుంటే కార్తీక్‌తో ఉంటుందని తెలిసిందని, తల్లిదండ్రులకు చెబితే బుద్ధి చెప్తామని అన్నారని, కానీ వారు కూడా న్యాయం చేయలేదని, పైగా పోలీస్ స్టేషన్లో రివర్స్ ఫిర్యాదు చేశారని, దీంతో అతను మనస్తాపం చెందాడని తెలిసిందని ఆ స్నేహితుడు తెలిపారు.

యువకుడితో అఫైర్
కాగా, గురువారెడ్డి భార్యకు కార్తీక్ అనే యువకుడితో అఫైర్ ఉందని విచారణలో తేలిన విషయం తెలిసిందే. గాయత్రి, కార్తీక్ కాల్ డేటా, సందేశాలపై అతను నిలదీయడంతో గతంలో పెద్దల సమక్షంలోను పంచాయతీ జరిగిందని చెబుతున్నారు. గురువారెడ్డిని బెదిరించేందుకు నిద్రమాత్రలు మింగడం.. అతని చావుకు కారణమైందని అంటున్నారు. తాను చేయని తప్పుకు ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications