భార్య అశ్లీల నటన: మనస్తాపంతో భర్త ఆత్మహత్య

 Man commits suicide as wife acts in a film
హైదరాబాద్: ఓ లఘు చిత్రంలో భార్య అసభ్యంగా నటించడంతో మనస్తాపానికి గురైన భరత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికితోడు, అత్తారింటి వేధింపులు కూడా ఎక్కువయ్యాయని అతను తాను రాసిన సూసైడ్ నోట్‌లో రాశాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం - చిత్తూరు జిల్లాకు చెందిన బండారు ఉదయ్ భాను (32) కోటక్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తూ అమీర్‌పేట సత్యం థియేటర్ సమీపంలోని ఓ అపార్టుమెంటులో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా భార్య లీలారాణికి, 11 ఏళ్ల కూతురికి గత రెండేళ్లుగా అతను దూరంగా ఉంటున్నాడు. అయితే, భార్య ఇటీవల ఓ లఘు చిత్రంలో అశ్లీలంగా నటించడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. దానికి తోడు అత్తారింటి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం అతను గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మధ్యాహ్నం సమయంలో గదికి వచ్చిన స్నేహితులు తలుపులు తట్టారు. లోపలి నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా అప్పటికే భాను మృతి చెంది ఉన్నాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+