కాల్‌మనీ వేధింపులు : యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
విజయవాడలో మరో కాల్‌మనీ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి కృష్ణా నది కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో
తన చావుకు కారణమైనవారి వివరాలు బయటపెట్టాడు. కాసుల రంగారావు,కోలా కిరణ్,కోలా రాంబాబు,తుపాకీల మహేష్ అనే నలుగురు వ్యక్తుల వల్ల తాను చనిపోతున్నట్టు చెప్పాడు.
రంగారావు వద్ద తాను తీసుకున్న రూ.10 వడ్డీ చొప్పున తీసుకున్న రూ.4లక్షల అప్పుకు ఇప్పటివరకు రూ.16లక్షలు చెల్లించానని చెప్పాడు. అయినప్పటికీ ఏవేవో లెక్కలతో ఇంకా తన నుంచి డబ్బు గుంజుతున్నారని, నిజానికి తనకు బతకాలని ఉన్నా, వారి వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.
రూ.1లక్ష ముట్టజెప్పిన ప్రతీసారి అతను లాడ్జిలో గది బుక్ చేయమనేవాడని, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను అక్కడికి తీసుకొచ్చుకునేవాడని తెలిపాడు.
రంగారావు ఇంట్లో ఉన్న టీవీ,ఫ్రిజ్ చాలావరకు వస్తువులు తాను ఇచ్చిన డబ్బులతో కొన్నవే అని చెప్పాడు. కాల్‌మనీ వ్యవహారంపై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు
చేసినా పట్టించుకోలేదని వాపోయాడు.

ఆత్మహత్య చేసుకుంటున్నందుకు 'సారీ.. పండు..' అంటూ తన భార్యను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రేమ్ ఆత్మహత్యతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతని చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలే గుంటూరు జిల్లా తాడేపల్లిలో వెంకట్ అనే కాల్‌మనీ బాధితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరిచికపోకముందే
ప్రేమ్ అనే మరో యువకుడు కాల్‌మనీ కోరల్లో చిక్కుకుని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications