స్త్రీతో అక్రమ సంబంధం: వ్యక్తి అనుమానాస్పద మృతి

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు గాజువాక శాంతి భద్రతల సర్కిల్‌ఇన్సపెక్టర్ సిహెచ్. వివేకానంద, ఎస్సై ఈశ్వరరావు, సిబ్బంది అక్కడికి చేరుకొని వివరాలు, ఆధారాలు సేకరించారు. క్లూస్ టీంను రప్పించారు. జాగిలాలను రప్పించి గాలించారు. మృతుడు రాంబాబు పెదగదిలి మండలానికి చెందినవాడు. ఇక్కడ టాటా ఎస్ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బిసిరోడ్డు ఏనుగుబొమ్మవద్ద మొక్కజొన్నలు అమ్ముకుంటున్న ఓ మహిళ మృతుడు రాంబాబుకు పరిచయమైంది. ఆమె పరిచయం వివాహేత సంబంధానికి దారి తీసింది.
బానోజితోటలో నివాసం ఉంటున్న ఆమె ఇంటికి అతను తరుచూ వెళ్తుండేవాడని చెబుతున్నారు. అదే విధంగా మంగళవారం రాత్రి రాంబాబు మద్యం సేవించి ఆమె ఇంటికి వెళ్లి రగడ చేసినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. దాంతో గొడవ జరిగింది. గొడవ పడ్డ కొన్నిగంటలకే రాంబాబు బుధవారం నగ్నంగా బిసిరొడ్డులో శవమైతేలాడు.
మృతుడు శరీరంపై గాయాలు ఉండటంతో రాంబాబు హత్యకుగురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ లక్ష్మిని, ఆమె కుమారుడు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications