ఎంత విడ్డూరం: మనిషిని కరిస్తే కుక్క చచ్చింది
కడప: తన పిల్లలను కాపాడుకోవడానికి ఓ శునకం ఓ మనిషిని కరిచింది. మనిషిని కరిచిన ఆ కుక్క పది నిమిషాల వ్యవధిలోనే నురగలు కక్కుకుని చచ్చిపోయింది. దీంతో ఊరంతా ఆ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడపజిల్లా పుల్లంపేట మండలం అనంతంపల్లె పంచాయతీ చాపల దళితవాడలో గురువారం ఈ సంఘటన జరిగింది.

ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడటానికి ఇబ్బంది పడుతుండటంతో అంతా అతడిని తిక్క వ్యక్తిగా వ్యవహరించేవారు. గురువారం అతడు వీధిలో వెళ్తుండగా వీధి కుక్క ఒకటి తన పిల్లలను కాపాడుకునేందుకు అతడిపైకి దూకి గాయపరిచింది.
తర్వాత పది నిమిషాలకే కుక్క నోట్లోంచి నురగలు వచ్చాయి. తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయింది. దీంతో ఆ వ్యక్తికి ఏదో వింత వ్యాధి ఉందని గ్రామస్థులంతా గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. కుక్క కళేబరాన్ని సాయంత్రం ఊరు బయట పడేశారు.












Click it and Unblock the Notifications