తాను చనిపోతూ... ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు..
కొంత మంది చనిపోయి కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఎన్నో కుటుంబాలకు ఆశాకిరణాలుగా మారతారు. అలాంటి వారిలో ఒకరు హనుమాన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హనుమాన్ రెడ్డి తాను చనిపోయి మరో ఐదుగురికి ప్రాణదాతగా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హనుమాన్ రెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అక్కడే వ్యాపారం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా జీవితం సాగిస్తున్నారు. అయితే, అతనికి అక్టోబర్ 29న తీవ్రమైన తలనొప్పి వచ్చింది. దాంతో కుటుంబసభ్యులు ఆయనను హూటాహుటిన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు.
బ్రెయిన్ డెడ్‌కు గురయిన హనుమాన్ రెడ్డి : హనుమాన్‌రెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయనకు తలలో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అక్టోబర్ 31న బ్రెయిన్‌డెడ్‌కు గురయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇంటిపెద్ద ఇక లేడు అన్న వార్త ఆ కుటుంబాన్ని కలిచివేసింది. అంత బాధలో కూడా ఆ కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఆశ్యర్యానికి గురిచేసింది. హనుమాన్ రెడ్డి కుటుంబసభ్యులు అంత శోకంలో కూడా వారు పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయం మరో ఐదుగురి జీవితాలను కాపాడింది.

అంత శోకంలోనూ అవయవదానానికి ఒప్పకున్న కుటుంబసభ్యులు : హనుమాన్‌రెడ్డి మరణవార్తను చెప్పిన డాక్టర్లు అనంతరం అవయవ దానంపై కిమ్స్ ఆసుపత్రిలోని అవయవ దాన సమన్వయ కర్తలు అతడి కుటుంబసభ్యులు, బంధువులకు అవగాహన కల్పించారు. దాంతో హనుమాన్‌రెడ్డి కుటుంబ సభ్యుల అంగీకారంతో హనుమాన్‌రెడ్డి అవయవాలను దానం చేశారు. అందులో ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, కార్నియా దానం చేశారు. హనుమాన్‌రెడ్డి అవయవాలు దానం చేసేందుకు భార్య విజయారెడ్డి, కుమారులు అరవింద్‌రెడ్డి, అభిరామ్‌రెడ్డి, అతడి తల్లిదండ్రులు అంగీకరించారు. దాంతో ఆసుప్రతి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. హనుమాన్ రెడ్డి భౌతికంగా తమ మధ్య లేకపోయినా, మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు ఎంతో గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా అవసరమున్న చోటికి ఈ అవయవాలను తరలించారని జీవన్‌దాన్ కమిటీ సభ్యులు వెల్లడించడం జరిగింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications