అలిపిరిలో తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్ల కలకలం
తిరుపతిలో తుపాకీ కలకలం చెలరేగింది. తిరుపతి - తిరుమల మార్గంలోని అలిపిరి వద్ద తుపాకీ, తూటాలు గుర్తించారు. వాటితో పాటు గుట్కా, అల్కాహాల్ బాటిల్స్ కూడా గుర్తించారు.
చిత్తూరు: తిరుపతిలో తుపాకీ కలకలం చెలరేగింది. తిరుపతి - తిరుమల మార్గంలోని అలిపిరి వద్ద తుపాకీ, తూటాలు గుర్తించారు. వాటితో పాటు గుట్కా, అల్కాహాల్ బాటిల్స్ కూడా గుర్తించారు.
టిటిడి విజిలెన్స్ అధికారులు బుధవారం ఉదయం ఓ కారును ఆపి తనిఖీ చేపట్టారు. పుణెకు చెందిన ఆ కారులో 14 రౌండ్ల తూటాలు, అత్యాధునిక తుపాకీని విజిలెన్స్, ఎస్పీఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కారులో ఉన్న మహిళ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తమ బంధువులు దర్శనానికి కొండపైకి వెళ్లారని చెప్పడంతో పోలీసులు రెండు నడక మార్గాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.












Click it and Unblock the Notifications