కొడుకు ప్రియురాలి పేరిట ఎఫ్‌బిలో తండ్రి బూతు బొమ్మ

ఉద్యోగంలో చేరిన నెల రోజులకే తన కన్నా పెద్ద వయసు ఉన్న యువతిని ప్రేమిస్తున్నట్లు తండ్రికి చెప్పాడు. ఈ వ్యవహారం నచ్చని ప్రభాకర రావు కొడుకును వారించేందుకు ప్రయత్నించాడు. అయితే సందీప్ వినలేదు. గత ఏడాది నవంబరులో సందీప్ ఇంటి నుండి వెళ్లిపోయాడు.
తన కొడుకు ఇంటి నుండి బయటకు వెళ్లిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమని భావించిన ప్రభాకర రావు.. సదరు యువతిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
ఆమె పేరిటన నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి ఆమె స్నేహితులకు అసభ్యకర ఫోటోలు, సందేశాలు పంపించాడు. ఇది తెలిసిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో నకిలీ ఫేస్ బుక్ చిరునామా ప్రభాకర రావుదిగా గుర్తించారు. ఆయనను విచారిస్తే తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతడి పైన కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications