వరుసకి సోదరి.. కోరిక తీర్చాలని వివాహిత వెంటపడ్డాడు

ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఫోనులో అసభ్యంగా మాట్లాడుతూ వేధించసాగాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసేది. అయినా అతను వేధింపులు మానలేదు. అతని మాటలను రికార్డు చేసి పెట్టింది. ఈ క్రమంలో గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాల వద్ద బోరు వద్దకు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ వివాహిత స్నానానికి వెళ్లింది.
అక్కడ కాపుకాసిన రమణ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో పొలానికి వెళ్లిన బాబాయి వరుస అయ్యే వ్యక్తి రమణను పట్టుకుని రచ్చబండ వద్దకు తీసుకొచ్చి నిలదీశాడు. ఇదిలా ఉండగా, తనను వేధించిన వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉందని, ఆమె పోలీసులను ఆశ్రయించింది. రమణ వైపు వారు కూడా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications