యువతి పేరుతో ఫేస్‌బుక్ ఖాతా: అసభ్య, అశ్లీల చిత్రాలు

ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బేగంపేటలో నివాసం ఉంటున్న మహ్మద్ ఖలీద్ (24) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఫేస్‌బుక్‌లో ఓ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఆమె తిరస్కరించడంతో కోపంతో సదరు యువతి పేరుతో ఫేస్‌బుక్ నకిలీ ఖాతా తెరిచాడు.
ఆ యువతిపేర తెరిచిన ఖాతా నుంచి సదరు యువతి స్నేహితులకు అసభ్య రాతలను, అశ్లీల చిత్రాలను పంపడం చేస్తున్నాడు. దీంతో ఆమె స్నేహితులు ఎందుకిలా చేస్తున్నావ్? అని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ఆమె సైబర్ క్రైం విభాగం పోలీసులను ఆశ్రయించింది.
దర్యాప్తులో భాగంగా మెయిల్ ఐడిలు, చిరునామాలను పరిశోధించినా ఫలితం లేకపోవడంతో సెల్‌ఫోన్ నెంబరును సేకరించి నిఘా ఉంచారు. శుక్రవారం ఉదయం బేగంపేటలో ఉండగా మహ్మద్ ఖలీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. ఇదే తరహాలో మరో ఏడు నకిలీ ఖాతాలు తెరిచి అశ్లీల ఫోటోలు పోస్ట్ చేయడంతోపాటు వారి పేర్లతో చాటింగ్స్ చేసినట్లు వెల్లడైంది.












Click it and Unblock the Notifications