బర్రెపై అత్యాచారం: నిందితునికి రెండేళ్ల జైలు శిక్ష

ప్రాసిక్యూషన్ కథనం మేరకు - కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన బొజ్జ బాలయ్యకు పాలు ఇచ్చే గేదె ఉంది. 2013 జులై 12వ తేదీ ఉదయం గేదెకు మేతవేసేందుకు బాలయ్య రాగా అదే గ్రామానికి చెందిన నీల లచ్చయ్య బర్రెపై అత్యాచారం చేస్తూ కనిపించాడు.
బాలయ్య దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకున్నారు. గేదెకు పశు వైద్యులతో పరీక్షలు నిర్వహించి నమూనాలను హైదరాబాదులోని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి నిందితుడు లచ్చయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి హుస్సేన్ శుక్రవారంనాడు నిందితుడు నీలం లచ్చయ్య (48)కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నేరం జరిగినప్పటి నుంచి లచ్చయ్య జైల్లోనే ఉంటున్నాడు. లచ్చయ్య గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications