విధవరాలుపై అనుమానం..! కత్తితో నరికి చంపిన దుర్మార్గుడు

తనతో అక్రమ సంబంధాన్ని కొనసాగించడంలేదని భర్త చనిపోయిన వెధవరాలిపై గుంటూరు జిల్లాకు చెందిన ఓ దుర్మార్గుడు ఆమే కత్తితో దాడి చేశాడు. తప్పించుకునేందుకు ఆమే రోడ్డుపై పరుగులు పెడుతున్నా వెంటాడీ మరి చంపాడు. దీంతో అమే అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త చనిపోయిన ఓ మహిళ.. తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా లైంగిక సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో శ్రీనివాస రావు అనే వ్యక్తి ఆ మహిళను కిరాతంగా కత్తితో నరికాడు.

man killed a widow women in Guntur district

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఈ దారుణం జరిగింది. కాగా గ్రామంలోని పంచాయితి వద్ద నిర్మల అనే మహిళ కూరగాయల సంచితో నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆమె మీద కత్తితో దాడి చేయబోయాడు. దీంతో బాధితురాలు రోడ్డు మీద పరుగులు పెట్టింది. అయినా, శ్రీనివాసరావు ఆమెను వెంటాడాడు. చివరకు ఆమెను పట్టుకుని కత్తితో దాడి చేశాడు.

ఇక మెడ మీద కత్తితో దాడీ చేయడంతో నిర్మల తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగ నిర్మల భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఆమెకు శ్రీనివాసరావుతో సంబంధం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, తనతో కాకుండా నిర్మల మరో వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తుండడంతో కోపం వచ్చిన శ్రీనివాసరావు కత్తితో వెంటాడి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+