వివాహితతో అక్రమ సంబంధం: తోపులోకి పిలిచి, కత్తితో పొడిచి, రాళ్లతో కొట్టి...
వివాహితతో అక్రమ సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. యువకుడిని గ్రామంలోని కొంత మంది వెంటాడి వేటాడి చంపేశారు.
చిత్తూరు: వివాహితతో అక్రమ సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. యువకుడిని గ్రామంలోని కొంత మంది వెంటాడి వేటాడి చంపేశారు. చిత్తూరు జిల్లా శివార్లలోని అనంతపురం జిల్లా తనకల్లు మండలం చీకటిమానిపల్లి వద్దగల పెద్దతోపులో ఆ దారుణం చోటుచేసుకుంది.
కదిరినాథునికోట పంచాయతీ చెన్నయ్యగారి పల్లికి చెందిన డేగాని ఆంజనేయులు (30) ను బుధవారం హత్య చేశారు. ఇతడు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన చెల్లిని చీకటిమానిపల్లి వాసికిచ్చి వివాహం చేశాడు. చెల్లి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.
ఆ క్రమంలో చీకటి మానిపల్లి దళితవాడకు చెందిన ఓ వివాహితతో ఆంజనేయులుకు లైంగిక సంబంధం కుదిరింది. దాన్ని మానుకోవాలని గ్రామంలోని కొంత మంది పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు.

పిలుచుకుని వెళ్లి...
బుధవారంనాడు గ్రామ సమీపంలో పెద్దతోపులోని సత్రంగుడి వద్దకు ఆంజనేయులును తీసుకుని వెళ్లారు. మద్యం తాపించి, సత్రంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి, హత్య చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అతను తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే రాళ్లతో కొట్టి,పెద్దతోపులోనే హత్య చేశారు. హతుడు ఆంజనేయులుకు తనకల్లుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది.
Recommended Video


దానికి ముందే సమాచారం...
మండలంలోని ఓ గ్రామంలో హత్య జరుగుతున్నట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా అంతకు ముందే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు మండలంలోని గంగసానిపల్లి, నారేవాండ్లపల్లి, కొక్కంటిక్రాస్, చీకటిమానిపల్లి ప్రాంతాల్లో తిరిగారు. ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఆ తర్వాత స్విచాఫ్ చేశాడు. పోలీసులు ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందించిన అజ్ఞాత వ్యక్తి గ్రామం పేరు చెప్పుంటే హత్యను ఆపే అవకాశం ఉండేది.

హంతుకుల్లో ఉన్నాడా...
ఫోన్ చేసింది హంతకుల్లో ఒక్కడై ఉంటాడా, మరో వ్యక్తా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఆ తర్వాత పోలీసులు హత్యా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తనకల్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

నిందితులను పట్టుకుంటాం...
ఆంజనేయులును హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ శ్రీని వాసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా రెండు పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు ఆయన వివరించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications