సెక్స్‌కు అంగీకరించలేదని భార్యను హత్య చేశాడు

చూసిన వాళ్లు దొంగతనం జరిగిందని అనుకోవడానికి అతను కిటికీలను, తలుపులను పగుల గొట్టాడు. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో హత్య కింద కేసు నమోదు చేశారు. హత్య నిరుడు డిసెంబర్ 24వ తేదీన జరిగింది.
ఆ రాత్రి 22 ఏళ్ల పావని తన భార్యతో గొడవకు దిగింది. కుమార్ ఇంటికి వచ్చి తమ లైంగిక జీవితం గురించి భార్యతో గొడవకు దిగాడని అంటున్నారు. అతను కొట్టడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత చీరతో ఆమెను పైకప్పుకు వేలాడదీశాడు. దోపీడీ జరిగిందని అనిపించేలా కిటికీలు, తలుపులు బద్దలు కొట్టాడు.
పావని శరీరంపై గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాలు ఇంటిలోనే ఉన్నాయి. విచారణలో తానే హత్య చేశానని సుబ్రహ్మణ్య కుమార్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సుబ్రహ్మణ్య కమార్, పావని పది నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో వివాహం చేసుకున్నారు. కొద్ది నెలల క్రితం వారు హైదరాబాదు వచ్చారు. తాను లైంగిక జీవితం పట్ల తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సుబ్రహ్మణ్య కుమార్ పోలీసులకు చెప్పాడు.












Click it and Unblock the Notifications