పెద్ద కూతురిని రేప్ చేసి గర్భవతిని చేశాడు: రెండో కూతురిపై కన్నేశాడు
హైదరాబాద్: వితంతువును నమ్మించి పెళ్లి చేసుకుని ఆమె కూతురిపై అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. ఆమె రెండో కూతురిపై కన్నేశాడు. పెద్ద కూతురిని లోబరచుకునేందుకు చిత్రహింసలు పెట్టాడు. ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడు. ఇప్పుడు రెండో కూతురు పైనా కన్నేసిన ఆ దుర్మార్గుడు లోబరుచుకునేందుకు ఆ చిన్నారినీ చితకబాదాడు.
ఆ బాలికలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ చొరవతో ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పరిధిలో జరిగిందీ సంఘటన. కర్ణాటకకు చెందిన శశికళ (45) అనే వివాహిత తన భర్త మృతిచెందడంతో నాలుగేళ్ల కిందట ఇద్దరు కూతుళ్లతో కలిసి నగరానికి జీవనోపాధి నిమిత్తం వచ్చింది. మేడ్చల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. మేడ్చల్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆ పిల్లలు చదువుతున్నారు.

అయితే అదే హోటల్లో పనిచేస్తున్న కర్ణాటకకే చెందిన చంద్ర (35) అనే వ్యక్తి శశికళను నమ్మించి పెళ్లిచేసుకున్నాడు. పిల్లలను పోషిస్తానని, మంచి చదువులు చెప్పిస్తానని నమ్మించిన ఆ కామపిశాచి కాలకూట విషం కక్కాడు. శశికళ పెద్ద కూతురు (14)ను చిత్రవధలకు గురిచేసి లోబరుచుకున్నాడు. ఆ బాలికను గర్భవతిని చేశాడు. ఈో క్రమంలోనే స్కూలుకెళుతున్న బాలిక కూర్చోలేక, నిలబడలేక అవస్థలు పడుతుండడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఏడు నెలల గర్భవతి అని నిర్ధారించడంతో టీచర్లు విస్తుపోయారు.
అంతటితో ఆగని చంద్ర రెండో కూతురుపైనా లైంగిక వేధింపులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఒళ్లంతా వాతలతో స్కూలుకు వెళ్లిన ఆ చిన్నారిని ప్రిన్సిపాల్ వివరాలు అడగడంతో తన తండ్రి కొట్టాడని చెప్పింది. మర్నాడు స్కూలుకు వచ్చిన ఆమె తల్లి ప్రిన్సిపాల్‌కు అబద్ధాలు చెప్పింది. వెంటనే ఆ చిన్నారి తన తల్లి అబద్ధం చెబుతోందని, తన తల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తన అక్కను ఇలాగే కొట్టి లోబరుచుకున్నాడని, ఇప్పుడు తననూ చిత్రహింసలు పెడుతూ అలాగే లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. అవాక్కయిన ప్రిన్సిపాల్ వారి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. పోలీసులు చంద్రను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications