కోరిక తీర్చలేదని నడిరోడ్డుపై కామాంధుడి దారుణం

తన కోరిక తీర్చాలని ఆమెను పలుమార్లు వేధించాడు. ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేసేవాడు. అతని వ్యవహారంతో విసిగిపోయిన ఆమె ఇల్లు మారింది.
ఆదివారం ఆమె ఇంట్లోకి వస్తువులు కొనేందుకు బజారుకు వచ్చింది. ఈ సమయంలో శ్రీని రెచ్చిపోయాడు. కనిపించకుండా తిరుగుతావా.. అంటూ దుర్భాషాలు ఆడి, ఆమె పైన పిడిగుద్దులు కురిపించాడు. కత్తితో ఆమె చాతి పైన రెండుసార్లు పొడిచాడు. అనంతరం పరారయ్యాడు.
మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిని శ్రీనును అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications