చాక్లెట్లు ఆశ చూపి బాలికకు బలవంతంగా కిస్, అరెస్ట్

నిందితుడు బాధిత బాలికకు చాక్లెట్లు ఆశ చూపించి ఇంట్లోకి తీసుకు వెళ్లాడు. ఇంట్లో ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడికి బాలిక గత కొన్నాళ్లుగా తెలుసు.
బాలిక తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లినప్పుడు ఆమె ఒక్కతే ఇంట్లో ఉంది. ఆమెకు చాక్లెట్లు చూపించి ఇస్తానని చెప్పాడు. ఆమెను తన ఇంటిలోకి తీసుకు వెళ్లాడు.
ఆమెను బలవంతంగా పట్టుకొని ముద్దు పెట్టాడు. ఈ విషయాన్ని బాలిక ఆ తర్వాత తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు తన తల్లిదండ్రులతో కలిసి సంతోష్ నగర్‌లో ఉంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications