అసభ్య ఫోటోలు: ప్లా‌న్‌తో వ్యక్తిని పట్టించిన యువతి

Man nabbed for sending lewd messages on whatsapp
హైదరాబాద్: అసభ్య సందేశాలు, ఫోటోలను పంపించి ఓ మహిళను వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాదు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తనను వేధిస్తున్న వ్యక్తిని సదరు బాధితురాలి పథకం ప్రకారం పోలీసులకు పట్టించింది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసుల కథనం మేరకు... బేగంపేట రసూల్‌పురాకు చెందిన పవన్ కుమార్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన అంబరుపేట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు వాట్సాప్ ద్వారా అశ్లీల చిత్రాలను పంపించాడు. తరచూ ఫోన్ చేసి వేధించేవాడు.

దీంతో విసిగిపోయిన ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పథకం ప్రకారం పవన్‌కు ఆదివారం ఉదయం సోమాజీగూడ కాఫీడే వద్దకు రమ్మని తెలిపింది. పవన్ అక్కడకు చేరుకున్నాడు.

కాఫీడేలో ఇద్దరూ కలిసి కాఫీ తాగాక సదరు మహిళ వి,యం అక్కడున్న తమ వారికి చెప్పగా వారంతా పవన్‌కు దేహశుద్ది చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 420, 419, 354 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+