ప్రేమకు నో చెప్పిందని: టెక్కీ పేరిట ఫేస్‌బుక్ తెరిచి ఫోటోలు: బాలికపై రేప్
గుంటూరు: తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు.. సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న యువతి పేరిట ఫేస్‌బుక్ ఖాతా తెరిచి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటన గుంటూరులో వెలుగు చూసింది. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ యువతి ఓ సాఫ్టువేర్ కంపెనీలో హైదరాబాదులో ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె ప్రతి శని, ఆదివారాలు గుంటూరు జిల్లాలోని బంధువుల ఇంటికి వస్తుంటుంది. ఆదివారం నాడు ప్రార్థనా మందిరంకు వెళ్తుంది. ఈ క్రమంలో ఆ ప్రార్థనాలయంలో ఉండే గురువు ఒకరు పరిచయమయ్యాడు.
అతనికి అప్పుడప్పుడు ఆర్థికంగా సాయం కూడా చేస్తుండేది. దానిని అలుసుగా తీసుకున్న అతను.. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆమెతో చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది.

అతని వేధింపులు ఆగక పోవడంతో తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు కూడా అతనికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.
తన ప్రేమను కాదన్నాననే కోపంతో అతను ఆమె పేరిట ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచి, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. తన ఫోటోలు అందులో ఉంచడంతో స్నేహితులు ఫేస్‌బుక్ ఖాతా చూసి అడుగుతున్నారని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం
దాచేపల్లి మండలంలోని కాట్రపాడు గ్రామంలో బాలిక పైన ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. లాజర్ అనే వ్యక్తి ఆ బాలికతో కొంతకాలంగా మాయమాటలు చెబుతూ అత్యాచారం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చూపించగా గర్భిణి అని తేలింది. బాలిక కుటుంబ సభ్యులు అతని వద్దకు వెళ్లి అడిగారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications