ఒకరితో సహజీవనం చేసి బిడ్డను కన్నాడు: మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు

విజయవాడ: ఓ యువకుడు ఓ యువతితో సహజీనవం చేసి మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. మరి కాసేపట్లో పెళ్లి అవుతుందనగా సహజీవనం చేసిన యువతి వచ్చి అడ్డుకుంది. పెళ్లి కుమారుడు తనతో సహజీవనం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పెళ్లిను అడ్డుకుంది.

ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. జిల్లాలోని పెదపారుపాడి మండలం దూలవానిగూడెంలో అనిల్ అనే యువకుడి వివాహం జరుగతుండగా ఓ మహిళ అక్కడికి వచ్చి అనిల్ తనతో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చాడని ఆరోపించింది.

Man prepared to marry another girl, leaving his live in partner

తనకు తెలియకుండా అనిల్ వివాహం చేసుకుంటున్నాడని, ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆమె ఆందోళనకు దిగింది. దీంతో పెళ్లి కొడుకు అనిల్ మండపం నుంచి పరారయ్యాడు. అనిల్‌తో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న పెళ్లికూతురు తరఫు వారు ఈ ఊహించని పరిణామానికి బిత్తరపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దుత్తలూరు పొలాల్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి కాళ్లు నేలను తాకి ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+