అమ్మవారి పాదాల చెంత పెట్టమంటే.. హుండీలో వేశాడు!: హాల్ టికెట్ కోసం విద్యార్థిని రోదన

సాధారణంగా పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు తమ తొలి పరీక్ష ఎదుర్కొనే ముందు తమ హాల్ టికెట్లను తమ సమీపంలోని ఆలయాల్లోని దేవుడి పాదాల చెంత పెడుతుంటారు. అలాగే ఇక్కడ కూడా ఓ విద్యార్థిని తన హాల్ టికెట్ అమ్మవార

విజయవాడ: సాధారణంగా పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు తమ తొలి పరీక్ష ఎదుర్కొనే ముందు తమ హాల్ టికెట్లను తమ సమీపంలోని ఆలయాల్లోని దేవుడి పాదాల చెంత పెడుతుంటారు. అలాగే ఇక్కడ కూడా ఓ విద్యార్థిని తన హాల్ టికెట్ అమ్మవారి పాదాల చెంత పెట్టాలని ఓ వ్యక్తిగా చెప్పగా.. ఆయన దాన్ని తీసుకుని వెళ్లి హుండీలో వేశారు. అనుకోని అనుభవంతో ఆమె ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైంది.

ఆ వివరాల్లోకి వెళితే.. గురువారం ఇంటర్‌ సెకండీయర్ పరీక్షలు రాయనున్న ఒక విద్యార్థిని మంగళవారం దుర్గగుడికి వెళ్లింది. సాధారణ క్యూలో తన హాల్‌ టికెట్‌తో పాటు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుంది.

 A man puts hall ticket in a temple hundi

అమ్మవారి పాదాల చెంత తన హాల్‌ టికెట్‌ పెట్టమని ఆమె ఆంతరాలయంలోకి వెళుతున్న వ్యక్తికి ఇచ్చింది. ఆమె గేటు దగ్గర నిల్చుంది. అంతరాలయంలోంచి తిరిగి వచ్చిన ఆ వ్యక్తిని తన హాల్‌ టికెట్‌ ఏదని ప్రశ్నించగా.. ఆయన 'నాకేం తెలుసు హుండీలో వేశాను' అని సమాధానమిచ్చాడు. దీంతో ఆ విద్యార్ధిని కన్నీటిపర్యంతమైంది.

'ఎందుకమ్మా ఏడుస్తావు.. ఇంకా సమయం ఉంది కదా.. నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు' అని ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. తన హాల్ టికెట్ ఇవ్వాలని ఆలయ అధికారులను ఆ విద్యార్ధిని వేడుకుంది. హుండీని ఎప్పుడుపడితే తెరవకూడదని.. బుధవారం లెక్కిస్తాం.. చూస్తామని అధికారులు బదులిచ్చారు.

అయితే, బుధవారం హుండీ తెరిచి లెక్కించగా దాంట్లో హాల్‌ టికెట్‌ కనపించలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. దుర్గగుడి హండీలో వేసిన హాల్‌ టికెట్‌ ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పుడు హుండీలో వేసి.. బుధవారమే హుండీ తీస్తే అందులోనే ఉండాల్సిన హాల్ టికెట్.. ఏమై ఉంటుందనేది సందేహంగా మారింది. కాగా, చివరికి ఆ విద్యార్థిని మరో హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరైనట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+