షాక్: నారావారిపల్లెలో చంద్రబాబు బంధువుకే రుణమాఫీ కాలేదు, నిలదీశాడు!
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత గ్రామంలోనే షాక్! చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోని ఆయన సమీప బంధువుకే రుణమాఫీ కాలేదట. ఈ నేపథ్యంలో నారావారిపల్లెలో ఆదివారం నాడు అధికారులకు చుక్కెదురైంది.
రుణమాఫీ పైన చంద్రబాబుకు చెందిన సదరు సమీప బంధువు అధికారులను నిలదీసినట్లుగా తెలుస్తోంది. నారావారిపల్లెలో జన్మభూమి - మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు అధికారులు వచ్చారు.

ఈ కార్యక్రమానికి చంద్రబాబు సమీప బంధువు నాగరాజు నాయుడు హాజరయ్యారు. ఆయన రుణమాఫీ పైన అధికారులను నిలదీశారని తెలుస్తోంది. తనకు ఎందుకు కాలేదని ప్రశ్నించారని తెలుస్తోంది. తనకు రూ.40 వేల అప్పు ఉంటే ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications