రెండేళ్లుగా కూతురిపై తండ్రి రేప్: విద్యార్థిని ఆత్మహత్య

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
కృష్ణా జిల్లా నిడమనూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. శ్రీవిద్య స్వస్థలం కడప జిల్లా. ఆమె తండ్రి నౌకాదళం మాజీ ఉద్యోగిగా తెలుస్తోంది.
పిచ్చికుక్క స్వైర విహారం
తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో సుమారు 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. గాయపడిన వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్కలు అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మండలం పుల్జాలలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications