రోడ్డు మీద పల్లెంలో రూ.500, రూ.1000 అమ్మకం: 'హీరో' వీడియో హల్‌చల్
ముంబై: రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు కరెన్సీ నోట్లను మంటల్లో తగులపెట్టారు. ఓ మహిళ అయితే తన ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నందుకు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
మరో ఆసక్తికర సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రూ.500, రూ.1000 నోట్లను ఓ పల్లెంలో పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముతున్నాడు. దీనిని ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ షూట్ చేశారు. దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
The Vendor (Marathi video but universal appeal) pic.twitter.com/CitjaH3cSf
— Riteish Deshmukh (@Riteishd) November 11, 2016
డబ్బులు అమ్మే ఆ వ్యక్తి పల్లెంలో రూ.500, రూ.1000 నోట్లను పెట్టుకొని మరాఠీ భాషలో.. నోట్లు అమ్ముతాం.. అంటూ తిరుగుతున్నారు. ఈ వీడియోను చాలామంది చూస్తున్నారు. వేలాది మంది షేర్ చేశారు. దీనిపై సెటైర్లు వేసుకుంటున్నారు. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 'మంచిది సార్ అద్భుతాలు జరుగుతున్నాయి. గణపతి బప్పా మోరియా' అని రితేష్‌కు జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications