హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్: అక్కినేని అఖిల్ పేరుతో పలువురి అమ్మాయిలతో చాటింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ పేరరుతో ఫేస్‌బుక్, వాట్సప్ ఖాతాలను ప్రారంభించి యువతులతో మోసపూరిత ఉద్దేశంతో చాటింగ్ చేస్తున్న యువకుడిని ఓ బాధితురాలు పోలీసులకు పట్టించిన విషయం తెలిసిందే. అతనికి ఆ యువతి బంధువులు దేహశుద్ధి చేశారు.

కేపీహెచ్‌పీ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. కూకట్ పల్లికి చెందిన ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం అఖిల్ పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి గత నెల 18న అతడితో చాటింగ్ చేసింది. మూడు రోజుల తర్వాత అతడు నటుడు కాదనే విషయం తెలిసింది.

Man thrashed for posing as Nagarjuna’s son Akhil on Facebook

దీంతో అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వాట్సప్ ద్వారా అతడితో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది. నేరుగా కలుద్దామని ప్రతిపాదించింది. దీంతో సోమవారం కేపీహెచ్‌బీలోని ఓ షాపింగ్ మాల్‌కు తన సోదరుడితో పాటు ఇద్దరిని తీసుకు వచ్చింది. అంతా కలిసి అక్కడకు వచ్చిన యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అతడు ఈ యువతితోనే కాకుండా మరికొందరుతో చాటింగ్ చేసినట్లుగా గుర్తించారు. అతడిని పోలీసులకు అప్పగించారు.

English summary
A 24-year-old man was caught and beaten up by a young woman, her brothers and friends for impersonating Nagarjuna’s son Akkineni Akhil on Facebook. The man was handed to the police. However, the cops refused to book a case as they found no case of cheating after verifying the FB chats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X