పెళ్లిచేసుకుందాం అంది.. అంతే.. ప్రేయసిని నదిలో తోసేశాడు.. తర్వాత ఏమైందంటే..
ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇంకా ఎంతకాలం ఇలా.. పెళ్లిచేసుకుందాం.. అని అడిగిన పాపానికి ఓ ప్రేమికుడు తన ప్రేయసిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు.
యానాం: ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇంకా ఎంతకాలం ఇలా.. పెళ్లిచేసుకుందాం.. అని అడిగిన పాపానికి ఓ ప్రేమికుడు తన ప్రేయసిని గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. ఈ ఘటన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో చోటుచేసుకుంది.
స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గండి అలివేణి(26) అదే పట్టణానికి చెందిన నాసిక శ్రీనివాస్ అనే యువకుడు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
శ్రీనివాస్ స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పెళ్లిచేసుకోమని అలివేణి ఒత్తిడి చేస్తోంది. దీంతో శ్రీనివాస్ ఆమెను ఆదివారం యానాం తీసుకొచ్చాడు. యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై వారు కొద్దిసేపు గడిపారు.

రాత్రి 2.30 గంటల సమయంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనివాస్ ఆగ్రహం పట్టలేక ప్రేయసి అలివేణి తలపై మోది, గొంతు నులిమి వంతెనపై నుంచి గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. అనంతరం ఆమె చరవాణి, హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు.
ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు అలివేణిని రక్షించి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న యానాం ఎస్సై వి.శివకుమార్ ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications